Notice Board

National Level Librarian Development Program on “Harnessing AI & Innovative Tools for Enhanced Library Services”, scheduled on 22-11-2024 at Aditya University. Registration Link: https://forms.office.com/r/22VadJ6Ez4...

Wednesday, 14 June 2017

World Blood Donor Day 2017


.
The theme of this year’s World Blood Donor Day is “Blood connects us all”. It focuses on thanking blood donors and highlights the dimension of “sharing” and “connection” between blood donors and patients. In addition, we have adopted the slogan “Share life, give blood”, to draw attention to the roles that voluntary donation systems play in encouraging people to care for one another and promote community cohesion.
The campaign aims to highlight stories of people whose lives have been saved through blood donation, to motivate regular blood donors to continue giving blood, and motivate people in good health who have never given blood to begin doing so, particularly young people.

Background information

Every year, on 14 June, countries around the world celebrate World Blood Donor Day. The event serves to thank voluntary, unpaid blood donors for their life-saving gifts of blood and to raise awareness of the need for regular blood donations to ensure the quality, safety and availability of blood and blood products for patients in need.
Transfusion of blood and blood products helps save millions of lives every year. It can help patients suffering from life-threatening conditions live longer and with higher quality of life, and supports complex medical and surgical procedures. It also has an essential, life-saving role in maternal and child care and during man-made and natural disasters.
However, in many countries, demand exceeds supply, and blood services face the challenge of making sufficient blood available, while also ensuring its quality and safety. An adequate supply can only be assured through regular donations by voluntary, unpaid blood donors. WHO’s goal is for all countries to obtain all their blood supplies from voluntary, unpaid donors by 2020.
Today, only 62 countries get close to 100% of their national blood supplies from voluntary unpaid blood donations, with 40 countries still dependent on family donors and even paid donors.

The objectives of 2017 World Blood Donor Day

  • thank blood donors for their life-saving gift of blood and highlight the theme of blood connecting us all
  • create wider public awareness of the need for regular, unpaid blood donation, and inspire those who have not yet donated blood to start donating, particularly young people in good health
  • promote and highlight the need to share life by donating blood
  • focus attention on blood services as a community service, and the importance of community participation for a sufficient, safe and sustainable blood supply
  • persuade ministries of health to show their appreciation to regular voluntary unpaid donors and commit to self-sufficiency in safe blood and blood products based on 100% voluntary, unpaid donations.

Monday, 12 June 2017

Tribute to Dr.C.Narayana Reddy

బాల్యం, విద్యాభ్యాసం

సి.నారాయణరెడ్డి 1931జూలై 29 (అనగా ప్రజోత్పత్తి సంవత్సరం నిజ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు) న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామము హనుమాజీపేట్లో జన్మించాడు. తండ్రి మల్లారెడ్డి రైతు. తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిబడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడయ్యాడు. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించాడు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశాంగానే ఉండేది. హైదరాబాదులోని చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందాడు. విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివాడు.

ఉద్యోగం

ఆరంభంలో సికింద్రాబాదు లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడుఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందాడు. విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది.
ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలుగజళ్ళువ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.
రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. 1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి నేటి వరకు 3500 గీతాలు రచించాడు.
సినారె గ్రంథాలు ఇంగ్లీషుఫ్రెంచ్సంస్కృతంహిందీమలయాళంఉర్దూకన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీఉర్దూ భాషల్లో కవితలల్లారు. అమెరికాఇంగ్లండుఫ్రాన్స్రష్యాజపాన్కెనడాఇటలీడెన్మార్క్, థాయ్ ల్యాండ్, సింగపూర్మలేషియామారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నాడు.

పురస్కారాలు

  1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ
  2. కేంద్ర సాహిత్య అకాడెమీ
  3. భారతీయా భాషా పరిషత్
  4. రాజలక్ష్మీ పురస్కారం
  5. సోవియట్-నెహ్రూ పురస్కారం
  6. అసాన్ పురస్కారం
  7. ( (gnanapeeta award))
మొదలైనవి ఆయన్ను వరించాయి. భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవాలతో సత్కరించింది. ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. [1]

కుటుంబం

ఆయనది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవే

పదవులు

విద్యాత్మకంగా,పాలనా పరంగా ఎన్నో పదవులు నిర్వహించారు.
  1. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు (1981)
  2. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1985)
  3. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు (1989)
  4. ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు (1992)
  5. రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళు
భారత రాష్ట్రపతి ఆయన్ను 1997 లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు.ఆరేళ్ళపాటు సభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి.1993 నుంచి అంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడుతున్నాడు.

రచనలు

కవిత్వం:
  • విశ్వంభర
  • మనిషి - చిలక
  • ముఖాముఖి
  • భూగోళమంత మనిషి
  • దృక్పథం
  • కలం సాక్షిగా
  • కలిసి నడిచే కలం
  • కర్పూర వసంతరాయలు
  • మట్టి మనిషి ఆకాశం
  • తేజస్సు నా తపస్సు
  • నాగార్జున సాగరం
  • విశ్వనాథ నాయడు
  • కొనగోటి మీద జీవితం
  • రెక్కల సంతకాలు
  • వ్యక్తిత్వం
వ్యాసాలు:
  • పరిణత వాణి
గేయనాటికలు:
  • అజంతా సుందరి : 1955లో సినారె ఈ సంగీత రూపకాన్ని రచించారు. 1953లో తన తొలిరచనగా నవ్వని పువ్వు అన్న సంగీత ప్రధానమైన రూపకాన్ని వెలువరించాకా వెనువెంటనే రచించిన రూపకాల్లో ఇదీ ఒకటి. ప్రఖ్యాత అజంతా శిల్పాలను చెక్కే కాలంలో శిల్పుల జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన సంగీత రూపకం
  • వెన్నెలవాడ
రచనారంగమే కాక ఆయన తెలుగు సాహిత్య పత్రికగా స్రవంతి సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. వేమూరి ఆంజనేయశర్మ, చిర్రావూరి సుబ్రహ్మణ్యంతో పాటుగా సినారె పత్రికకు ప్రధాన సంపాదకత్వం వహించారు.

సినీ ప్రస్థానం

సినిమా పాటలు

సి.నారాయణ రెడ్డి 1962 లో గులేబకావలి కథ లోని పాటలను రచించుట వల్ల సినిమా ప్రస్థానం లోకి అడుగు పెట్టారు. నన్ను దోచుకుందువటే వెన్నెల దొరసానీ అనే పాటతో పేరుపొందారు.[4] తర్వాత చాలా సినిమాల్లో మూడు వేలకు పైగా పాటలు రాశాడు.

పురస్కారాలు

ప్రశంసలు

డా.సి. నారాయణరెడ్డి గురించి ప్రముఖుల ప్రశంసలను చీకోలు సుందరయ్య ఇలా ఉదహరించాడు 
  • చేరా - "ఇప్పటి కవుల్లో నారాయణరెడ్డిగారికున్నంత శబ్దస్ఫూర్తి ఉన్నవాళ్లు ఎక్కువ మంది లేరు. శబ్దస్ఫూర్తి అంటే శబ్ద సంపద ప్లస్‌ స్ఫూర్తి. అంతేకాదు. ఆ శబ్దాలను అతికే శక్తి మహాద్భుతమైనది. శబ్దాలకు రంగు, రుచివాసన కలిగించే ఆల్కెమీ ఏదో సినారె దగ్గర ఉండి ఉండాలి. అది అనిర్వాచ్యం. అది పరిశోధనకందదు.
  • ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం - "విశ్వమానవ హృదంతరాళాల్లోని చైతన్య జలపాతాల సవ్వడినీ, విప్లవ జ్వాలల వేడినీ రంగరించి కవితా జగత్తులో మానవతా దృక్పథానికి మనోజ్ఞ రూపాన్ని దిద్దుతున్న శిల్పి సి.నారాయణరెడ్డి. పద్యం నుండి గేయానికి, గేయం నుండి వచనానికీ అభ్యుదయాన్ని సాధిస్తూ పట్టింది బంగారంగా, పలికింది కవిత్వంగా ప్రగతి సాధిస్తున్న కవిచంద్రులు రెడ్డిగారు. మనిషిలోని మమతను, బాధను, కన్నీటినీ, మున్నీటినీ, అంగారాన్నీ, శృంగారాన్నీ, వియోగాన్నీ, విప్లవాన్నీ కవితల్లో కీర్తించడం రెడ్డిగారి మతం"
  • సాహితీ చరిత్ర రచయిత డాక్టర్‌ జి.నాగయ్య - "ప్రణయ కవిత్వమును, చారిత్రక గాథలను రచించి ప్రఖ్యాతులైన సి.నారాయణరెడ్డిగారు పద్యమును, గేయమును చక్కగా నడిపించగల దిట్టలు. ఛందోరహస్యము తెలిసిన నారాయణరెడ్డి ఆధునిక యుగధర్మమున కనుగుణముగా ప్రగతి మార్గములో పయనించి వచన కవిత్వమును నాజూకుగా నడిపించి ఆ ప్రక్రియకు వన్నె చేకూర్చారు. నారాయణరెడ్డి ఏదో ఒక 'ఇజము'నకు కట్టుబడక సమకాలిక సంఘటనలు తనను ప్రేరేపించినపుడు కవిగా స్పందించి చక్కని గేయాలు రచించి వాటిని సంపుటాల కెక్కించాడు... నారాయణరెడ్డి కావ్యాలలో మధ్యతరగతివారి కష్టసుఖాలే ఎక్కువగా కనబడతాయి... కులమతమ్ముల ఉక్కుడెక్కల, నలిగిపోయెడు మాలలంగని, అల్లనాడే కంటనీరిడినట్టి వెన్నెల మనసు నీయది అని ఆయన గురజాడకు కైమోడ్పు ఘటించాడు. ఆకలి వాకిట కేకలు పెట్టిన, ఆరని బాధల అంచులు ముట్టిన జ్వాలా శిశువుగా వీరు శ్రీశ్రీని అభినందించారు
  • వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు - "నారాయణరెడ్డి తిలక్‌లాగా రెండంచుల పదును గల కత్తి. కవిత్వంలో అగ్ని చల్లగలరూ, అమృతం కురిపించగలడూ"